ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Anil: సర్వేపల్లి కాలువ పనులపై ప్రతిపక్షాలది రాద్ధాంతం: మంత్రి అనిల్ - సర్వేపల్లి కాలువ వార్తలు

సాగునీటికి ఇబ్బంది లేకుండా సర్వేపల్లి కాలువను తీర్చిదిద్దుతున్నామని మంత్రి అనిల్ తెలిపారు. కాలువ ఆధునీకరణ పనులపై తెదేపా నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister anil kumar yadav
minister anil kumar yadav

By

Published : Jul 5, 2021, 8:21 PM IST

సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరం మూలాపేటలో పునర్నిర్మిస్తున్న కోనేరు పనులను మంత్రి పరిశీలించారు. వచ్చే నెలలో కోనేరును ప్రారంబిస్తామని వెల్లడించారు.

సర్వేపల్లి కాలువపై తెలుగుదేశం నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెడ్ కాంక్రీట్ ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని చెబుతున్న తెదేపా నేతలు.. వారి హయాంలో రోడ్లు ఎలా వేశారని ప్రశ్నించారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా సర్వేపల్లి కాలువను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details