కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని... జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. ముందు జాగ్రత్తలతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. కరోనా నిర్మూలనపై నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసు వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. హోం ఐసోలేషన్‌లో 800 మంది ఉండగా, జిల్లాలో 300 ఐసోలేషన్ బెడ్స్ ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. వీటిని వెయ్యికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 29 లక్షల మందిని సర్వే చేశామని వెల్లడించారు. నిత్యావసర దుకాణాలు తప్ప మిగిలినవన్నీ మూసివేయాలని కోరారు.
కరోనా కట్టడిపై మంత్రి అనిల్‌కుమార్ సమీక్ష - నెల్లూరులో కరోనా వార్తలు
కరోనా కట్టడిపై నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
minister Anil Kumar Yadav review on corona at nellore district