రబీ సీజన్లో ఎనిమిది లక్షల పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు అనిల్ కుమార్, గౌతమ్‌రెడ్డి నిర్ణయించారు. సోమశిల జలాశయం కింద పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో ఐదు లక్షల ఎకరాలకు, కండలేరు జలాశయం కింద మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సాగునీరు వదిలామని, రేపటినుంచి అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తామని మంత్రి తెలిపారు. ఒక్క ఎకరం కూడా ఎండనివ్వకుండా ఈ రబీ సీజన్లో సాగునీరు అందిస్తామన్నారు.
'సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి జలాశయాల్లో జలకళ' - సోమశిల జలాశయంపై మంత్రుల సమీక్ష వార్తలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జలాశయాల్లో జలకళ సంతరించుకున్నాయని.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహామండలి సమావేశంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.
'సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి జలాశయా'సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి జలాశయాల్లో జలకళ'ల్లో జలకళ'