ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నెలాఖరులోగా శ్మశానవాటిక పనులు పూర్తి చేయాలి'

నెల్లూరు బోడిగాడితోటలో శ్మశానవాటిక నిర్మాణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేసి, శ్మశానవాటికను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

minister anil
మంత్రి అనిల్

By

Published : May 17, 2021, 8:24 AM IST

నెల్లూరు నగరంలోని బోడిగాడితోటలో శ్మశానవాటిక నిర్మాణ పనులను రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. రెండు కోట్ల రూపాయల వ్యయంతో శ్మశానవాటిక నిర్మాణ పనులు సాగుతున్నాయి.

పనుల వివరాలను.. మంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేసి, శ్మశానవాటికను అందుబాటులోకి తీసుకురావాలని వారికి మంత్రి సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ మంత్రి వెంట ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details