ప్రణాళిక ప్రకారం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రిఅనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన.. తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు(Minister Anil Kumar Fires On Chandrababu news). ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా..? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టులో కమీషన్లకు ఆశ పడ్డారని ఆరోపించారు.
ఇక్కడి సంక్షేమ పథకాలు..తెలంగాణలో ఉన్నాయా..?
ఒక్క చోటే ఇచ్చారు: మంత్రి అనిల్ తెలంగాణ, ఏపీలో అభివృద్ధిపై స్పందించిన మంత్రి అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయా..? అని వ్యాఖ్యానించారు. ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని.. తెలంగాణలో చేశారా..? ప్రశ్నించారు.తెలంగాణలో ఏ సంక్షేమాన్ని చూసి మేము నేర్చుకోవాలన్నారు. తెలంగాణలో అమ్మ ఒడి, నాడు- నేడు, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారా..? అంటూ ప్రశ్నలు సంధించారు. ఒక ఎన్నిక కోసం.. పది లక్షలు ఇస్తామంటూ పథకాన్ని ప్రవేశపెట్టి స్టంట్ వేశారంటూ సెటైర్లు విసిరారు.
ఇదీ చదవండి:TDP leaders: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి.. డీజీపీని రీకాల్ చేయాలి: చంద్రబాబు