నెల్లూరు టూరిజం హోటల్లో దాడికి గురైన మహిళా ఉద్యోగి దివ్యాంగురాలైన ఉషారాణిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. నగరంలోని కొండాయపాలెం గేటు వద్దనున్న ఉషారాణి నివాసానికి వెళ్లిన మంత్రి.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగురాలిపై దాడి ఘటన బాధాకరమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ దాడికి పాల్పడిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితురాలికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
దివ్యాంగురాలిపై దాడి బాధాకరం: మంత్రి అనిల్ కుమార్ - నెల్లూరులో మంత్రి అనిల్ పర్యటన
నెల్లూరు జిల్లాలోని టూరిజం హోటల్లో మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలిని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. దాడి చేసిన భాస్కర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
minister anil kumar