కరోనా నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరం 51వ డివిజన్లో మంత్రి పర్యటించారు. రోజు జిల్లాలో ఆరు వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తుండటంతో 6 నుంచి 8 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయని తెలిపారు.
నగరంలోని నారాయణ కొవిడ్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి సందర్శించారు. హాస్పిటల్స్ లోనూ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు అందరూ సహకరిస్తే కరోనాను నివారించవచ్చాన్నారు. రానున్న రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన పడకలను సిద్ధం చేయాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.