కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే వ్యాధి వ్యాప్తి జిల్లాలో తగ్గిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలోని రెడ్ జోన్ ప్రాంతమైన మూలపేటలో మంత్రి పర్యటించారు.
కోయంబేడు మార్కెట్ ప్రాంతంతో సంబంధమున్న 150 మందిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించారన్నారు. వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. లాక్డౌన్ నిబంధనలకు నగర ప్రజలు మరిన్నిరోజులు సహకరించాలని కోరారు.