జనవరి 9న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెల్లూరు రానున్నారు. అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తారు. నగరంలోని వేణుగోపాల స్వామి కళాశాల మైదానాన్ని రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రఘురాం, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులు పరిశీలించారు. ఉదయం 10గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానానికి సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి వేణుగోపాల స్వామి మైదానానికి వెళతారు.
9న నెల్లూరుకు సీఎం... ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అనిల్ - జనవరి 9న నెల్లూరులో పర్యటించనున్న సీఎం జగన్
అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం కోసం సీఎం జగన్ జనవరి 9న నెల్లూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ ఏర్పాట్లును పరిశీలించారు.
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిల్