ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MINISTER ANIL: రూ.550 కోట్లతో నెల్లూరు నగర అభివృద్ధి: మంత్రి అనిల్ - నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి అనిల్ కామెంట్స్

రూ.70 లక్షల వ్యయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన తిక్కన పార్క్ (Tikkana Park) ఆధునీకరణ పనులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Minister Anil Kumar) శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది నవంబరు నాటికి రూ.550 కోట్లతో నెల్లూరు నగర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

రూ. 550 కోట్లతో నెల్లూరు నగర అభివృద్ధి
రూ. 550 కోట్లతో నెల్లూరు నగర అభివృద్ధి

By

Published : Sep 25, 2021, 4:21 PM IST

ఈ ఏడాది నవంబరు నాటికి రూ.550 కోట్లతో నెల్లూరు నగర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Minister Anil Kumar) స్పష్టం చేశారు. రూ.70 లక్షల వ్యయంతో చేపట్టిన తిక్కన పార్క్ (Tikkana Park) ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సఫాయి మిత్రలో నెల్లూరు కార్పొరేషన్ (Nellore Corporation) మొదటి స్థానంలో రావడం అభినందనీయమన్నారు.

రానున్న రోజుల్లో కార్పొరేషన్​ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి అనిల్ ప్రకటించారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వత పనులనే తాము చేపడుతున్నట్లు వెల్లడించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేసి..2024 ఎన్నికలకు వెళ్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details