కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. అందులో భాగమైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెదేపా హయాంలో జరిగిన అక్రమాలు అన్నీ బయటపడతాయని విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా అరెస్టు చేయక తప్పదని అన్నారు.
అక్రమాలు చేస్తేనే అరెస్టు చేసింది : మంత్రి అనిల్ - అచ్చెన్నాయుడిని అరెస్ట్ న్యూస్
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలలో జరిగిన అక్రమాలు తొందరలోనే బయటపడుతాయని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అక్రమాలు చేస్తేనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని తెలిపారు.
" తప్పు చేశారని అరెస్టు చేస్తే.. తెదేపా నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. అన్ని నిజాలు బయటపడుతాయి. తెదేపా హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. అందులో భాగమే ఈఎస్ఐ కుంభకోణం. బీసీలకు మేమేదో అన్యాయం చేసినట్లు మాట్లాడితే ఎలా..? బీసీలకు ప్రతినిధి అయినట్లు అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై గొడవ చేస్తున్నారు. కుంభకోణంలో ఇంకా ఎవరి పేర్లు బయటపడతాయోనని చంద్రబాబు భయపడుతున్నారు"- మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ఇదీ చదవండి:ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్‌తో ప్రభుత్వం ఒప్పందం