ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి ఉప ఎన్నికపై వైకాపా సవాల్‌కు సిద్ధమా ?: మంత్రి అనిల్ - తిరుపతి ఉప ఎన్నిక తాజా వార్తలు

తిరుపతి ఉప ఎన్నికపై వైకాపా విసిరిన సవాల్‌ను స్వీకరించే సత్తా తెదేపాకు ఉందా? అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వైకాపా ఓటమి పాలైతే.. తమ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమని, మీరు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలన్నారు.

minister anil challenge on tirupathi by poll
తిరుపతి ఉప ఎన్నికపై వైకాపా సవాల్‌కు సిద్ధమా ?

By

Published : Apr 12, 2021, 3:24 PM IST

తిరుపతి ఉప ఎన్నికపై వైకాపా సవాల్‌కు సిద్ధమా ?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించే సత్తా తెదేపాకు ఉందా అని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వైకాపా ఓటమి పాలైతే.. తమ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమని, మీరు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలన్నారు.

తెదేపా, భాజపా, జనసేన ఒకటై వైకాపాను ఓడించేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. వకీల్ సాబ్ సినిమా టికెట్లపై లేనిపోని రాద్ధాంతం సృష్టించటం అనవసరమన్నారు. అసలు వకీల్ సాబ్​తో చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో వైకాపా లక్షల మెజార్టీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details