ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు భరోసా ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి అనిల్

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో జరిగిన రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు భరోసా ద్వారా జిల్లాలో 2,24,751మంది రైతుల ఖాతాల్లో 123.61 కోట్ల రూపాయలు జమకానున్నాయని మంత్రి తెలిపారు.

By

Published : May 15, 2020, 5:27 PM IST

నెల్లూరులో జరిగిన రైతుభరోసా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్... రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసాను ప్రారంభించారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుభరోసా ద్వారా జిల్లాలో 2,24,751మంది రైతుల ఖాతాల్లో 123.61 కోట్ల రూపాయలు జమకానున్నాయని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details