ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి ఆదేశాలతో.. బ్లాక్ ఫంగస్ బాధితురాలికి వైద్యం - block fungus patient at Nellore

బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళకు ఒంగోలు జీజీహెచ్​లో చికిత్సకు అక్కడి వైద్యులు నిరాకరించారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..జీజీహెచ్ సూపరింటెండెంట్​తో మాట్లాడి ఆమెకు చికిత్స అందించారు.

block fungus patient at Nellore
ఒంగోలు జీజీహెచ్​

By

Published : Jun 7, 2021, 2:24 AM IST

ఒంగోలుకు చెందిన పద్మ అనే మహిళ బ్లాక్ ఫంగస్ వ్యాధితో వసుధ కల్యాణ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. హాస్పిటల్​లో రూ. రెండున్నర లక్షలు తీసుకొని వైద్యం చేయకుండా బ్లాక్ ఫంగస్ పెషేంట్‌ను గత శనివారం డిశ్చార్జీ చేశారు. దీనితో దిక్కు తోచని పరిస్థితిలో పద్మ.. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్​కి వెళ్లారు. అక్కడి వైద్యులు నిబంధనలు పేరుతో( ఆధార్ కార్డులో కృష్ణా జిల్లా అని ఉందని) ఒంగోలు జీజీహెచ్​లో చేర్చుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లింది.

బ్లాక్‌ ఫంగస్‌ బాధితురాలని ఆదుకోవాలని సామాజిక మాధ్యమాల్లో పలువురు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే పద్మను హాస్పిటల్​లో జాయిన్ చేసుకొని మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు పద్మకు చికిత్స ప్రారంభించారు.

ఇదీ చదవండి..Covid Cases : కొత్తగా 8,976 కరోనా కేసులు, 90 మరణాలు నమోదు

ABOUT THE AUTHOR

...view details