ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2021, 5:43 PM IST

ETV Bharat / state

కరోనా నియంత్రణకు మినీ లాక్​డౌన్!

రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా... చాలా ప్రాంతాల్లో మినీ లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.

mini-lock-down-conducted-in andhrapradhesh
కరోనా నియంత్రణకు మినీ లాక్​డౌన్

కర్నూలులో మినీ లాక్​డౌన్ కొనసాగుతోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున... మున్సిపల్ కమిషనర్, మేయర్, పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు సోమవారం నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరవాలని సూచించారు. ఫలితంగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మధ్యాహ్నం నుంచి షాపులను బంద్ చేశారు.

అనంతపురం జిల్లాలో...

అనంతపురం జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో... ఇవాల్టి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని అధికారులు సూచించారు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

వెంకటగిరిలో...

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో కరోనా వ్యాప్తి నియంత్రణకు నేటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు పట్టణంలో విధించిన ఆంక్షలను అమలు చేయాలని కోరుతూ మైక్ ద్వారా సూచనలు చేశారు.

ఇదీ చదవండి:

వైద్యారోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details