నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలం మినగల్లు గ్రామస్థులు ఇసుక లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఇసుక రీచ్ నుంచి గ్రామంలోకి వస్తున్న వాహనాల వల్ల కాలుష్యం పెరిగిందని వారు ఆరోపించారు.
లారీల శబ్దాలతో నిద్ర రావడం లేదని ఆవేదన చెందారు. ఇష్టారాజ్యంగా ఇసుక లారీలు తిరగుతున్న తీరుతో.. ఇళ్ల ముందు ఆడుకుంటున్న తమ పిల్లలు ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.