మా ఇంటికి పంపించండి సారు..!! - కావలిలో వలస కూలీల ఇబ్బందులు
వివిధ రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చిన తమను ఇళ్లకు పంపించాలని... నెల్లూరు జిల్లా కావలిలో చిక్కుకున్న వలస కూలీలు వేడుకుంటున్నారు. ఆహారం సరిగా లేక ఇబ్బందులకు గురవుతున్నామని... అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
![మా ఇంటికి పంపించండి సారు..!! migrant works problems in kavali at nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7199265-863-7199265-1589470005466.jpg)
పనుల కోసం ఊరు గాని ఊరు వచ్చి... లాక్‌డౌన్ కారణంగా నానా అవస్థలు పడుతున్నామని తమను స్వస్థలాలకు పంపాలని వలస కూలీలు కోరుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాలు నుంచి వలస వచ్చిన 118 మంది కూలీలను... నెల్లూరు జిల్లాకావలిలోని ఎస్సీ ,ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉంచారు. ఆహారం సరిగా లేక అవస్థలు పడుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. స్వస్థలాలకు పంపించాలని స్థానిక అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమను స్వ గ్రామాలకు తరలించాలని వేడుకుంటున్నారు.