జిల్లాలోని నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఉంటున్న వలస కార్మికులు ఆందోళన చేపట్టారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కూలీ పనులు చేసే 195 మంది... మేనకూరు సెజ్‌లో పనిచేసే 130మంది మూడు రోజులుగా పాఠశాలలోనే ఉంటున్నారు. వీరిని రైళ్లలో వాళ్ల రాష్ట్రాలకు తరలించే క్రమంలో అధికారులు వారిని బస్సులో ఎక్కించడం దింపడం చేస్తున్నారు.
ఈ మేరకు ఆందోళన చేపట్టిన వలస కూలీలు తాము ఇళ్లకు నడచి వెళ్తామంటూ పట్టుబట్టి జాతీయ రహదారి పక్కన చెట్ల కింద కూర్చున్నారు. లాక్డౌన్ నుంచి పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నమంటూ మేనకూరు సెజ్‌లో పనిచేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం రైల్లో గూడూరు నుంచి ఛత్తీస్ గఢ్, బిహార్ తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.