తినడానికి తిండిలేక... ఉండటానికి చోటులేక వలస కూలీలు ఇక్కట్లు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు 4వేల మందిని అధికారులు గుర్తించారు. వారి స్వస్థలాలకు పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. జిల్లాలో ఈ ప్రక్రియ కొలిక్కిరాక వారంతా ఇబ్బందులు పడుతూ... కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. స్వస్థలాలకు పంపాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.
నెల్లూరులో వలస కూలీల అవస్థలు - నెల్లూరు వార్తలు
లాక్‌డౌన్ మరికొంతకాలం పొడిగించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు నెలరోజులకు పైగా ఉపాధి లేక కూలీలు పస్తులుంటున్నారు. అయితే వారి స్వస్థలాలకు పంపాలంటూ కేంద్రం, రాష్ట్రాలు అనుమతులిచ్చినా... జిల్లాలో ఈ ప్రక్రియ కొలిక్కిరాలేదు. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెల్లూరులో వలస కూలీల ఇక్కట్లు