నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రైల్వే లైన్ పనులు చేపడుతున్న వలస కూలీలు తమను సొంత ప్రాంతాలకు పంపించాలని స్థానిక ఆర్డీఓ కు విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన ఆర్డీఓ ఉమాదేవి... ఉపాధి లేని వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
'ఉపాధి లేని కార్మికులను స్వస్థలాలకు చేరుస్తాం'
లాక్డౌన్తో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చిక్కుకున్న వలస కూలీలు తమను స్వస్థలాలకు చేర్చాలని స్థానిక ఆర్డీఓకు కోరారు. స్పందించిన ఆర్డీఓ ఉపాధి లేని వలస కూలీలను స్వరాష్ట్రాలకు పంపిస్తామని తెలిపారు.
ఆత్మకూరులో నిరసన చేస్తున్న వలస కూలీలు
ఈ సమస్యను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఆర్డీఓ... మంత్రి సూచన మేరకు వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. సమ్మతించిన కూలీలు పనులు చేసేందుకు అంగీకరించారు. మిగిలిన కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉమాదేవి తెలిపారు. వలస కార్మికులకు ఆర్డీవో మాస్క్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఇదీచదవండి.