ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 రోజులుగా పడిగాపులు.. స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ఎదురుచూపులు - గూడూరులో వలసకూలీల వార్తలు

లాక్​డౌన్ నేపథ్యంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ లోని వివిధ పరిశ్రమల్లో పనిచేసే 130 మంది వలస కూలీలు .. ఇంటికి వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వారిని ఎప్పుడు తరలిస్తారో అధికారులకు స్పష్టత లేని కారణంగా... వారంతా 20 రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Migrant laborers  waiting in revenue office   20days yet at guduru
గూడూరులో వలసకూలీల పడిగాపులు

By

Published : May 16, 2020, 11:32 AM IST

నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్​లో వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న వలస కూలీలు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుమారు 130 మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు 20 రోజుల క్రితమే నమోదు చేసుకొని కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశారు.

కానీ... వారిని ఎప్పుడు తరలిస్తారన్నది అధికారులకూ స్పష్టత లేకుండా పోయింది. వలస కూలీలు గత 20 రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సొంత రాష్ట్రాలకు తమల్ని పంపాలని ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులను వేడుకొంటున్నారు. అధికారులు మాత్రం మాకు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details