వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నెల్లూరులో సూక్ష్మ కళాకారుడు ముసవ్వీర్ రూపొందించిన బుల్లి గణనాథులు ఆకట్టుకుంటున్నాయి. రెండున్నర గ్రాముల కంటే తక్కువ బంగారంతో 11 గణనాథుల ప్రతిమలను తయారు చేశాడు. ఈ విగ్రహాల ఎత్తు 0.5 సెంటిమీటర్ల నుంచి 3 సెంటీమీటర్లు వరకు ఉన్నాయి. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న ఈ లంబోదరుని ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా త్రిముఖ గణనాధుని ప్రతిమ విశేషంగా అలరిస్తోంది. ఈ బుల్లి గణనాథులను తయారు చేసేందుకు పదిరోజుల సమయం పట్టిందని ఈ కళాకారుడు పేర్కొన్నాడు. వీటితో పాటు తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది.
ఔరా..! బుల్లి గణనాథులు..సూక్ష్మకళాకారుడి నైపుణ్యం - గణనాథులు
నెల్లూరు పట్టణంలో ఓ సూక్ష్మకళాకారుడు తయారు చేసిన బుల్లి బంగారు గణనాథులు ఆకట్టుకుంటున్నాయి.
నెల్లూరులో బుల్లి గణనాథులు ...సూక్ష్మకళాకారుడి నైపుణ్యం