ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్లాక్ మార్కెట్​లో​ రెమ్​డెసివిర్ అమ్మకం.. వ్యక్తి అరెస్ట్ - nellore remdesivir news

బ్లాక్ మార్కెట్​లో రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని విజిలెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కో ఇంజక్షన్​ను రూ. 30 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.

remdesivir in black market
నెల్లూరు బ్లాక్ మార్కెట్ లో రెమ్​డెసివిర్ అమ్మకం

By

Published : Apr 21, 2021, 1:45 AM IST

నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ల్యాబ్​లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి రెమ్​డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్​లో అమ్ముతుండగా విజిలెన్స్ పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. ఒక్కో ఇంజక్షన్​ను రూ.30వేలకు బ్లాక్​లో అమ్ముతున్నట్లు పోలీసులు చెప్పారు. ఒంగోలుకు చెందిన వలి అనే వ్యక్తితో కలిసి ఈ విక్రయాలు సాగిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.

ABOUT THE AUTHOR

...view details