Mekala Bhaskar Rao selected as National Best Teacher: విధిని ఎదిరించి.. అంగవైకల్యం అడ్డుకాదని నమ్మి.. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక Mekala Bhaskar Rao Selected for Best Teacher Award at National Level:జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2023కు నెల్లూరుకు చెందిన ఉపాధ్యాయుడు మేకల భాస్కర్ రావు ఎంపిక కావడం జిల్లాలోని ఉపాధ్యాయులు హర్షిస్తున్నారు. మేకల భాస్కర్ రావు నెల్లూరు కొండాయపాళెం నగర పాలక ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. పోలియోతో వికలాంగుడైనా చక్కటి పనితీరును కనపరుస్తూ విద్యార్ధుల తల్లితండ్రులు, అధికారుల అభినందనలు పొందారు.. పేదకుటుంబం నుంచి వచ్చిన ఆయన 2000వ సంవత్సరంలో విధుల్లో చేరారు. వృత్తిలో క్రమశిక్షణ, చిత్తశుద్దిగా పనిచేయడం, సెలవుల్లో కూడా విద్యార్ధుల కోసం శ్రమించడం మూడు పద్దతులు పాటించాలని తోటి ఉపాధ్యాయులకు ఆయన సూచిస్తారు. ఈ సూత్రాలను పాటిస్తూ అంచెలు అంచెలుగా అనేక అవార్డులతో ఉత్తమ ఉపాద్యాయుడిగా జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు.
Villagers Paraded Teacher on Their Shoulders: గురువుపై గ్రామస్థులు అభిమానం.. భావోద్వేగానికి గురైన ఉపాధ్యాయుడు
Mekala Bhaskar Rao from Nellore District:పాఠశాలలో విద్యార్ధులకు మంచి చదువుతో పాటు మౌళిక వసతులు ఏర్పాటు చేయడంలో ఉపాధ్యాయులు పాత్ర ఉండాలని అందరికీ చెబుతుంటాడు. ప్రభుత్వం ద్వారా, దాతల ద్వారా పాఠశాలలో సమస్యలను తీర్చాలని ఆయన ఆచరించి చూపించారు. 22సంవత్సరాలుగా అనేక మంది ఉత్తమ విద్యార్ధులను తయారు చేస్తూ అనేక అవార్డులు పొందాడు.
Government Teacher Murder: కారుతో ఢీకొట్టి.. వంద మీటర్లు ఈడ్చుకెళ్లి.. ఉపాధ్యాయుడి దారుణ హత్య
భాస్కర్ రావు అందుకున్న అవార్డులు (Awards received by Bhaskar Rao)..
- 2012లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు.
- 2018లో రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా అందుకున్నారు.
- 2019లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా అందుకున్నారు.
- 2022లో స్వాతంత్ర్య దినోత్సవంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి అంబటి రాంబాబు నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
Teacher murder ఆధిపత్యం కోసమే ఉపాధ్యాయుడి హత్య.. నలుగురు అరెస్ట్.. అధికారుల ఉదాసీనతతోనే హత్య: చంద్రబాబు
Bhaskar Rao will Receive the National Best Teacher Award by President:టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డును అందుకోనున్నారు. భాస్కర్ రావు అందరికీ ఆదర్శం అని సహోపాధ్యాయుడు అభినందిస్తున్నారు.నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని భాస్కర్ రావు చెబుతున్నారు. పిల్లలతో చక్కగా కలిసిపోయి ఆనందంగా ఆడుతూపాడుతూ గడుపుతున్నారు