నెల్లూరు జిల్లాలో ఏర్పాటుచేసిన మేడ్ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవపాల్ మాట్లాడారు. దళిత ఉద్యోగులు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి సమస్యలున్న ధైర్యంగా ప్రశ్నించే హక్కుందని గుర్తుచేశారు. గుంటూరులో అక్టోబరు 10న మేడ్ రెండో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు ఐదుగురు మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. ఉద్యోగులంతా హాజరై సభ విజయవంతం చేయాలని కోరారు.
గుంటూరులో అక్టోబరు 10నుంచి మేడ్ మహాసభలు - నాయుడుపేట
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మేడ్ సమావేశం నిర్వహించారు. దళిత ఉద్యోగుల భద్రతకోసం ఏర్పాటైన ఈ సంఘంలో దళితులంతా మమేకం కావాలని మేడ్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. అక్టోబరు 2న మేడ్ రెండో మహాసభలు గుంటూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న మేడ్ రాష్ట్ర అధ్యక్షుడు