మేడే వేడుకలను ఉదయగిరిలో కార్మిక సంఘాల నాయకులు నిర్వహించారు. ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ కూడలిలో రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య... కార్మిక సంఘాల నాయకులతో కలసి జండాను ఎగరవేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాల కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు - ఉదయగిరిలో మేడే సంబరాలు తాజా వార్తలు
మేడే సందర్భంగా ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ కూడలి వద్ద రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య ఇతర నాయకులతో కలిసి జెండాను ఎగరవేశారు. కార్మిక హక్కులను కాపాడుకునేందుకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి భవిష్యత్తులో ఐక్య పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
ఉదయగిరిలో మేడే సంబరాలు