నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. ఆమెను సుజాతగా గుర్తించారు. 12 సంవత్సరాల క్రితం ఆమెకు చంద్రశేఖర్ అనే వ్యక్తితో వివాహమైంది.
గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఉరివేసుకున్న స్థితిలో చనిపోయి కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.