ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్క్​ఫెడ్​ ద్వారా పొగాకు కొనుగోలుపై నెల్లూరు జిల్లా రైతుల హర్షం - నెల్లూరు జిల్లా తాజా పొగాకు వార్తలు

గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పొగాకు వేలం కేంద్రంలో ప్రభుత్వమే మార్క్​ఫెడ్​ ద్వారా కొనుగోలు చేయడం వల్ల మంచి ధర లభిస్తుందంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

markfed buys tobacco in nellore district and farmers happy about their crop rate
గిట్టుబాటు ధర వల్ల పొగాకు రైతుల ఆనందం

By

Published : Jul 6, 2020, 5:47 PM IST

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, ఉదయగిరి, కలిగిరి, వింజమూరు తదితర మండలాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేస్తుంటారు. ఓ సంవత్సరం మంచి ధరలు పలికినా... మరో ఏట ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించి మార్క్​ఫెడ్​ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని డీసీ పల్లి, కలిగిరి కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించారు. మేలి రకం పొగాకును​ కిలో రూ. 201కు కొనుగోలు చేయడం వల్ల నెల్లూరు జిల్లా పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ధరకు పొగాకు కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు కొనుగోలు చేయలేదని, ప్రభుత్వమే కొనుగోలు చేయడం సంతోషంగా ఉందని రైతులు తెలిపారు.

ఈ విషయంపై డీసీ పల్లి పొగాకు వేలం నిర్వహణాధికారి దేవానంద హర్షం వ్యక్తం చేశారు. రైతులు ఇంకా నాణ్యమైన పొగాకు తీసుకొస్తే ఇంకా మంచి రేట్లు వస్తాయన్నారు.

ఇదీ చదవండి :డీసీ పల్లి పొగాకు కేంద్రంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details