నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రావమ్మ పాలకమండలి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా షేక్ అలీ అహ్మద్, వైస్ చైర్మన్గా సుభాషినితో పాటు పాలకమండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా తన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తానని అలీ అహ్మద్ తెలిపారు. తనపై ఎమ్మెల్యే మేకపాటి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నియోజకవర్గంలోని రైతులందరి సహకారంతో మార్కెట్ కమిటీ సేవలను విస్తృతం చేస్తానన్నారు. అందరినీ సమన్వయం చేసుకొని మార్కెట్ కమిటీ ద్వారా మంచి పాలన అందించాలని ఎమ్మెల్యే మేకపాటి చైర్మన్కు సూచించారు.
ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం - market committee chairman oath in udayagiri
ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా షేక్ ఆలీ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రావమ్మ పాలకమండలి చేత ప్రమాణం చేయించారు.

ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం