ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కావలిలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్ - నెల్లూరు వార్తలు

నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు మర్రిచెట్టు సంఘం దగ్గర గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో మొత్తం 10కిలోల గంజాయి, 4 చరవాణులు, 2కార్లు , రూ.45వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.

Marijuana seized
కావలిలో గంజాయి పట్టివేత

By

Published : Dec 16, 2020, 7:26 PM IST

నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు మర్రిచెట్టు సంఘం సమీపంలో ఉన్న గౌరవరం టోలుప్లాజా వద్ద గంజాయి పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 6కిలోల గంజాయితో పాటు ఇద్దరిని పోలీసులు మొదట అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మరో కారులో కూడా సరుకు వస్తుందనే విషయం గుర్తించారు. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

గౌరవరం టోల్​ ప్లాజా వద్ద..

గౌరవరం టోల్​ ప్లాజా వద్ద మరో కారును కూడా తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 4కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2కార్లు, 4చరవాణులు, రూ.45వేల నగదు సీజ్ చేశారు. అరకు నుంచి సరుకు రవాణా చేస్తున్నట్లు నిందితులు తెలిపారు. పట్టుబడిన వారిలో ముగ్గురు ప్రకాశం జిల్లాకు చెందిన వారని, మరొకరు తెలంగాణలోని మెదక్​కు చెందిన వ్యక్తి అని డీఎస్పీ ప్రసాద్ వివరించారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ దాదాపు రూ.11.20లక్షలు ఉంటుందని తెలిపారు. చాకచక్యంగా గంజాయి తరలింపును అడ్డుకున్న ఐపీఎస్ ట్రైనీ అధికారి మహేశ్వర రెడ్డిని, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:శ్రీహరికోట: పీఎస్​ఎల్​వీ-సీ50 కౌంట్​డౌన్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details