నెల్లూరు జిల్లా తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌కు... ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, తెదేపా నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. ఆరు వందల ఏళ్ల నాటి తెలుగు సాహిత్యానికి చెందిన ప్రాచీన గ్రంథాలు తంజావూరులో పరిరక్షిస్తున్నారని షరీఫ్ అన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషితో, బెంగళూరులో ఉన్న తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఈ అధ్యయన కేంద్రాన్ని శాసనమండలి కమిటీ సందర్శించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.