ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే ట్రాక్​ దాటబోయాడు... కానీ అంతలోనే.. - నెల్లూరు తాజా వార్తలు

నెల్లూరులో ఓ వ్యక్తి రైలు ఇంజిన్​కు చిక్కుకొని మృతి చెందాడు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్​ రైలు ఇంజిన్​కు చిక్కుకున్నట్లు... నెల్లూరు జిల్లా వేదాయపాలెం స్టేషన్ సమీపంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంకటాచలం రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆపి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రైలు ఇంజన్ కు చిక్కుకొని వ్యక్తి  మృతి
రైలు ఇంజన్ కు చిక్కుకొని వ్యక్తి మృతి

By

Published : Dec 4, 2020, 7:51 AM IST

Updated : Dec 4, 2020, 7:30 PM IST

రైలొస్తోందని గేట్లు పడ్డాయి.. అటువైపు ఓ 10 మంది.. ఇటువైపు మరో 10 మంది వాహనదారులు, పాదచారులు నిలిచి ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి హడావుడిగా ముందుకు పరిగెత్తాడు. ‘ఓయ్‌.. బాబు.. రైలొస్తోంది.. ఆగు.’ అంటూ అక్కడున్న వారందరూ కేకలు వేశారు. అప్పటికే రైలు ఆయన్ను ఢీకొని ప్రాణాలు ఎగరేసుకుపోయింది. రైలు వెళ్లాక చూస్తే మృతదేహం కూడా కనిపించలేదు. అసలేం జరిగిందో.. మృతదేహం ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదు. చివరకు 13 కి.మీ.లు రైలు వెళ్లాక వెంకటాచలం రైల్వే స్టేషన్‌లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కొండాయపాలెం గేట్‌ ప్రాంతంలో జరిగింది.

హత్యా..?ఆత్మహత్యా..?

గూడ్సు రైలు చెన్నై వైపు వెళ్తుండగా కొండాయపాలెం గేట్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతిచెందాడు. అయితే ఇది ఆత్మహత్యా, ప్రమాదవశాత్తు జరిగిందో ఎవరికీ తెలియడం లేదు. రైల్వే అధికారులు కూడా ధ్రువీకరించడం లేదు. మృతదేహం కనిపించకపోవడంతో గేట్‌మెన్‌ వేదాయపాలెం స్టేషన్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే రైలు స్టేషన్‌ దాటి వెళ్లిపోయింది. దాంతో వెంకటాచలం సిబ్బందికి సమాచారం అందించారు. రైలును ఆపి పరిశీలించగా ఇంజిన్‌ ముందు భాగంలోనే మృతదేహం వేలాడుతూ కనిపించింది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరణానంతర పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

బురేవి ప్రభావం.. నెల్లూరు, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు

Last Updated : Dec 4, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details