ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగులో కారు గల్లంతు... 10కి.మీ నడిచి ఇంటికి చేరిన యువకుడు - nivar effect on prakasham district

ప్రకాశం జిల్లా మద్దిపాడు-నాగులుప్పలపాడు మధ్య కొత్తకోట వాగులో గల్లంతైన రాజేష్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వాగులో కొంత దూరం కొట్టుకు పోయి ఒడ్డుకు చేరాడు. సుమారు 10 కిలోమీటర్లు దూరం నడిచి ఇంటికి చేరుకున్నాడు.

manswimmed 10 kms and saved his life at prakasham district
man swimmed 10 kms and saved his life at prakasham district

By

Published : Nov 27, 2020, 1:09 PM IST

Updated : Nov 27, 2020, 4:27 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు-నాగులుప్పలపాడు గ్రామాల మధ్య కొత్తకోట వాగులో గల్లంతైన వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. వాగులో కొంత దూరం కొట్టుకు పోయిన అతను ఒడ్డుకు చేరి 10 కిలోమీటర్లు నడిచి చదలవాడ వరకు చేరుకున్నాడు. అనంతరం చదలవాడ నుంచి ఒంగోలులోని తన నివాసానికి చేరుకున్నాడు.

మద్దిపాడు-నాగులుప్పలపాడు గ్రామాల మధ్య కొత్తకోట వాగు ప్రవాహంలో ఓ కారు గురువారం రాత్రి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాజేష్‌ అనే యువకుడు గల్లంతయ్యాడు. మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆ యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

ఇదీ చదవండి: నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...వెయ్యి కోట్లకుపైగా నష్టం

Last Updated : Nov 27, 2020, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details