ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మకూరులో ఉద్రిక్తత..పోలీస్​ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా - మనస్థాపానికి లోనై ఆత్మకూరు పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆత్మహత్య

భార్యభర్తల గొడవ చినికి చినికి..ఓ వ్యక్తి ప్రాణాలు పోయేలా చేసింది. ఈ ఘటనలో పోలీసులు అత్యుత్సాహమే బాధితుడి ప్రాణాలను బలిగొందని..మృతదేహంతో బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికార్ల ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీస్​ స్టేషన్ ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన​

By

Published : Oct 21, 2019, 5:38 PM IST

Updated : Oct 28, 2019, 8:27 AM IST

పోలీస్​ స్టేషన్ ఎదుట మృతదేహంతో బంధువుల ఆందోళన​

భార్యాభర్తల గొడవ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది.అంతటితో ఆగక,ప్రాణాలు పోయేలా చేసింది.వివరాల్లోకి వెళ్తే,నెల్లూరు జిల్లా ఆత్మకూరు..కొండూరు గ్రామానికి చెందిన కామిరెడ్డి,సుదర్శనమ్మ దంపతుల మద్య ఇటీవల తగదాలు చోటుచేసుకున్నాయి.ఇవి కాస్తా,కుటుంబ గొడవలకు దారి తీసాయి.దీంతో సుదర్శనమ్మ,తన భర్తపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దీంతో కామిరెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు,తమదైన శైలిలో విచారించారు.దీనిని అవమానంగా భావించిన కామిరెడ్డి,తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పోలీస్ స్టేషన్ లోనే తాగాడు.దీంతో అప్రమత్తమైన పోలీసులు కామిరెడ్డిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించాడు.పరిస్థితి విషమించడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది.రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్న కామిరెడ్డి ఇవాళా మృతి చెందాడు.దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కామిరెడ్డి బంధువులు,కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్ళి ధర్నాకు దిగారు.ఈ ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో..పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు శవాన్ని తీసుకెల్లేది లేదని..బంధువులు భీష్మించడంతో..ఉన్నతాధికార్లు రంగంలోకి దిగారు.డీఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడంతో,మృతదేహాన్ని అక్కడ్నుంచి తరలించారు.

Last Updated : Oct 28, 2019, 8:27 AM IST

ABOUT THE AUTHOR

...view details