SUICIDE ATTEMPT : నెల్లూరు జిల్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహబూబ్ బాషా అనే బాధితుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో చుట్టుపక్కల వారు అతడిని అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సీజేఎఫ్ఎస్ భూములను వైసీపీ నేతలు కొందరు ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని బాధితుడు ఆరోపించాడు. అయితే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవటం లేదని వాపోయాడు. స్థానిక తహసీల్దార్‌కి ఎన్నిసార్లు తెలిపిన పట్టించుకోవటం లేదని బాధితుడు ఆరోపించాడు. అంతే కాకుండా తనపై అట్రాసిటీ కేసులు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు న్యాయం చేయడం లేదంటూ ఆవేదనతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.
వైసీపీ నేత భూమిని అక్రమించాడు.. అధికార్లు పట్టించుకోలేదు.. పైగా కేసులు పెట్టారు.. - nellore latest news
SUICIDE ATTEMPT : వైసీపీ నేతలు తమ భూమిని ఆక్రమించుకున్నారని ఓ బాధితుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన నెల్లూరులో జరిగింది. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయాడు.
![వైసీపీ నేత భూమిని అక్రమించాడు.. అధికార్లు పట్టించుకోలేదు.. పైగా కేసులు పెట్టారు.. SUICIDE ATTEMPT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17245793-1036-17245793-1671421730056.jpg)
SUICIDE ATTEMPT