రోడ్డుపై నడిచి వెళుతున్న వ్యక్తిని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మంగళగిరి కాలనీకి చెందిన రాజా అనే వ్యక్తి బస్టాండ్ కూడలిలోని దర్గా కాంప్లెక్స్‌లో క్షౌరశాల దుకాణాన్ని నడుపుకుంటున్నాడు. దుకాణాన్ని తెరిచేందుకు కాలనీ నుంచి బస్టాండ్ కూడలికి నడుచుకుంటూ వెళ్తుండగా బస్సు ఢీ కొట్టింది. ఈ ధాటికి ఆయన పక్కనే ఉన్న రాళ్లపై పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి - ఆర్టీసీ బస్సు
నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్‌కి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితుడు మృతి చెందాడు.

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి