నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తా పడ్డ సంఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. చేపలు పట్టేందుకు సోమశిల గ్రామానికి చెందిన ఐదుగురు పడవలో వెళ్లారు. నీటి ప్రవాహానికి ఎదురుగా వెళ్లగా ఒక్కసారిగా పెరిగిన ప్రవాహంతో పడవ బోల్తా పడింది. పడవలో ఉన్న ఐదుగురు నీళ్లలో పడిపోగా.. నలుగురు ఈదుకుంటూ గట్టుకు చేరుకున్నారు. పడవలోని వలలో చిక్కుకొని గరిక శ్రీను(40) మృతి చెందాడు. పడవ బోల్తా పడ్డ సమయంలో గట్టు పైన ఉన్న ఓ యువకుడు తీసిన వీడియోను బట్టి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందునే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సోమశిల జలాశయంలో పడవ బోల్తా.. వ్యక్తి దుర్మరణం - boat capsize at sosila reservoir news update
సోమశిల జలాశయంలో పడవ బోల్తాపడి ఒకరు మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు ఉన్న పడవ.. నీటి ప్రవాహం ఎక్కువగా రావడం ఒక్కసారిగా బోల్తా పడింది.
సోమశిల జలాశయంలో పడవ బోల్తా.