ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సు దిగాడు.. అదే బస్సు కింద పడి చనిపోయాడు! - నాయుడుపేటలో ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి

కదులుతున్న బస్సు పక్కనే నిల్చున్న వ్యక్తి ఒక్కసారిగా చక్రాల కింది పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీ కోనేటి రాజుపాళెం జరిగింది. బస్సు కదిలే సమయం వరకూ రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తి ఒక్క సారిగా బస్సు వెనక చక్రాలు పడి చనిపోయాడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.

man falls under the bus died
మేనకూరులో బస్సు కింద పడి వ్యక్తి మృతి

By

Published : Jan 28, 2021, 6:40 AM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీ కోనేటి రాజుపాళెం ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పుదుచ్చేరికి చెందిన వ్యక్తి.. మూడు రోజుల క్రితం మేనకూరులోని ఓ నిర్మాణ సంస్థలో బైండింగ్​ పని చేసేందుకు వచ్చాడు.

నిన్న ఉదయం బస్సు నాయుడుపేట నుంచి వెంకటగిరి వెళ్తూ ఉండగా కోనేటి రాజుపాలెం వద్ద బస్సు దిగాడు. బస్సు కదిలే వరకూ రోడ్డు పక్కన నిలబడ్డాడు. అంతలోనే... ప్రమాదవశాత్తూ బస్సు వెనక చక్రాల కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details