తుపాను ప్రభావంతో నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాల వల్ల విద్యుత్తు తీగ తెగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన అబ్దుల్ రజాక్ స్టిక్కరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లేఅవుట్ ప్రాంతంలో పనిచేసేందుకు వెళ్తున్న అతనిపై కరెంటు తీగ పడింది. దాంతో అక్కడిక్కడే మృత్యవాత పడ్డాడు. చెట్టు విరగడం వల్ల విద్యుత్తు తీగ తెగి రజాక్ మీద పడిందని స్థానికులు తెలిపారు.
వర్షానికి తెగిన విద్యుత్ తీగ.. వ్యక్తి మృతి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
వర్షం కారణంగా విద్యుత్ తీగ తెగిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నెల్లూరులో జరిగింది. చెట్టు విరగడం వల్ల విద్యుత్ తీగ తెగిందని స్థానికులు తెలిపారు.
విద్యుత్తు తీగ తెగిపడి ఓ వ్యక్తి మృతి