నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కనిగిరి రిజర్వాయర్ సదరన్ కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. చేజర్ల మండలం ఆదూరుపల్లి చెందిన మాలాద్రి అనే వ్యక్తి మద్యం సేవించి.. సొంత గ్రామానికి బయలుదేరే క్రమంలో బుచ్చి టోల్ గేట్ వద్ద హంగామా చేసి, సదరన్ కాలువలో ఈత కొట్టేందుకు దిగాడు. మద్యం మత్తులో లోతు తెలియక కాలువలో మునిగి చనిపోయాడు. స్ధానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్ధలానికి చేరుకున్న విచారణ చేపట్టారు.
కాలువలో పడి వ్యక్తి మృతి - death cases in nellore
నెల్లూరు జిల్లా కనిగిరి రిజర్వాయర్ సదరన్ కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్యం మత్తులో ఈత కొట్టేందుకు దిగిన అతను మునిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
కాలువలో పడి వ్యక్తి మృతి