నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. గేదెను ఢీకొట్టటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు మర్రిపాడు మండలం రాజుపాళెం గ్రామనికి చెందిన తుమ్మిశెట్టి పెంచిలయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గేదెను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి గేదెను ఢీకొట్టటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద జరిగింది.
గేదెను ఢీకొని వ్యక్తి దుర్మరణం