ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య - sucide case for job at nelore
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవం గ్రామంలో.. ఉద్యోగం రాలేదన్న బాధతో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవం గ్రామంలో ఉద్యోగం రాలేదన్న బాధతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అన్వర్ బాషా.. ఐటీఐ చదివి ఇటీవల విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మన్ ఉద్యోగానికి పరీక్ష రాశాడు. ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాడు. ఫలితాలలో తన నంబరు లేకపోయేసరికి మనస్తాపానికి గురయ్యాడు. పురుగుమందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అతన్ని తల్లిదండ్రులు ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆరోగ్యం విషమించి ప్రాణం విడిచాడు.