ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేపూరులో వ్యక్తి దారుణ హత్య..వివాహేతర సంబంధమే కారణమా? - నెల్లూరు తాజా వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరులో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Man brutally murdered in Depuru
దేపూరులో వ్యక్తి దారుణ హత్య

By

Published : Nov 11, 2020, 4:40 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామానికి చెందిన కటారి వెంకటేశ్వర్లు (35) దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల కిందట మేకలు, గొర్రెలకు మేత కోసం పొలాలకు వెళ్లి...తర్వాత తిరిగి రాలేదు. కంపచెట్ల మధ్య ఒంటినిండా గాయాలతో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంకటేశ్వర్లకు, అతని భార్యకు తరచూ గొడవలు జరిగేవని..ఇందులో భాగంగానే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుని బావమరిదితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి భార్యకు గ్రామస్థులు దేహశుద్ధి చేసి ఇంట్లో బంధించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అక్కడే ఉన్న కత్తిని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details