నెల్లూరు జిల్లా పీపీ గూడూరు మండలంకుమ్మరిపాలెంలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనందయ్య కరోనా మందు నకిలీని అతను తయారుచేస్తున్నట్లు.. గుర్తించామని చెప్పారు. పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యలపై.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఆనందయ్య కరోనా మందు.. నకిలీ తయారీదారుడు అరెస్ట్ - today anandayya fake corona drug latest update
దేశ వ్యాప్తంగా సంచాలనం రేపిన ఆనందయ్య కరోనా మందు ఇంకా బయటకు రానేలేదు. అప్పుడే దానికి నకిలీ మందు తయారు చేసే వారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. జిల్లాలోని కుమ్మరిపాలెంలో.. ఆనందయ్య నకిలీ కరోనా మందు తయారు చేస్తున్న వ్యక్తిని అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఆనందయ్య నకిలీ కరోనా మందు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు