దళితుల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్ దళితుల మధ్య చిచ్చుపెట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారని మాల మహాసేన జాతీయ అధ్యక్షుడు ఆలగ రవికుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెలగపూడిలో మూడు రోజుల క్రితం దళిత వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మహిళ మరియమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె మృతికి బాధ్యుడైన ఎంపీ నందిగం సురేష్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మాల మహాసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి.. రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో రాష్ట్ర హోం మంత్రి సమక్షంలో ఘర్షణకు కారణం ఎంపీ నందిగం సురేష్ అని అక్కడ ఉన్న వారంతా నినాదాలు చేసినా.. ఎఫ్ఐఆర్లో ఎంపీ పేరు నమోదు చేయకుండా బయటికి పంపారన్నారు.
'ఎఫ్ఐఆర్లో ఎంపీ నందిగం సురేష్ పేరు చేర్చండి'
గుంటూరు జిల్లా వెలగపూడిలో మరియమ్మ మృతి కేసులో నందిగాం సురేష్ పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చాలని మాల మహాసేన నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మాల మహాసేన నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
మరియమ్మ మృతి కేసు ఎఫ్ఐఆర్లో ఎంపీ నందిగం సురేష్ పేరు చేర్చాలంటున్న మాల మహాసేన