ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు - mahatma gandi jayanthi in nellore district

మహాత్మాగాంధీ జయంతిని నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలువురు పార్టీ నేతలు, అధికారులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నెల్లూరు జిల్లాలో ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2019, 10:35 PM IST

నెల్లూరు జిల్లాలో ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నెల్లూరులోని గాంధీ విగ్రహానికి పలువురు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచానికే గాంధీజీ మార్గదర్శిగా నిలిచారని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైకాపా... గాంధీ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందన్నారు. భాజపా నాయకులు నేత వస్త్రాలను పంపిణీ చేయగా, నెల్లూరు ప్రగతి లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి అధికారులు, ఉద్యోగులు నివాళులర్పించారు.. ప్రజలు గాంధీజీ చూపిన అడుగుజాడల్లో నడుచుకొని ఆయన ఆశయాలను అమలు చేయాలని తహసీల్దార్ అన్నారు.

గూడూరు రాజవీధిలోని గాంధీబొమ్మ సెంటర్లో గాంధీజి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మున్సిపల్ కమిషనర్ ఓబులేశు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట గాంధీ మందిరం వద్ద సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య...గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక టంగుటూరు ప్రకాశం పంతులు పాఠశాలలోని గాంధీ విగ్రహానికి మాజీమంత్రి పరసారత్నం, తెదేపా నాయకులు పూలమాలలు వేశారు.


ఇవీ చూడండి-'సచివాలయాలు జవాబుదారీతనానికి మారుపేరుగా నిలవాలి'

ABOUT THE AUTHOR

...view details