ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2020, 12:46 PM IST

ETV Bharat / state

దుకాణంలోకి దూసుకుపోయిన 2 లారీలు

ద్రాక్ష లోడుతో రహదారిపై వెళ్తున్న లారీకి.. గేదె అడ్డు వచ్చింది. అదుపు తప్పిన వాహనం.. అటుగా వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. అదుపు తప్పిన ఈ 2 లారీలు రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకుపోయాయి. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేని కారణంగా.. ప్రాణాపాయం తప్పింది.

lorry accident
lorry accident

నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కోట క్రాస్ రోడ్డు వద్ద.. రోడ్డు పక్కనే ఉంటున్న దుకాణంలోకి తెల్లవారు జామున రెండు లారీలు దూసుకెళ్ళాయి. బెంగుళూరు నుంచి విజయవాడకు ద్రాక్ష లోడుతో వెళ్తున్న లారీకి గేదె అడ్డు వచ్చిన కారణంగా.. అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ 2 లారీలు దుకాణంలోకి దూసుకెళ్ళాయి.

ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎవరు లేకపోవడం.. ప్రాణాపాయాన్ని తప్పించింది. దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కారణం అయిన గేదె అక్కడిక్కడే మృతి చెందింది. సుమారు లక్షా 50 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని దుకాణ దారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details