నెల్లూరు నగరంలో మరో తొమ్మిది రోజులు పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రకటించారు. ఆదివారంతో లాక్డౌన్ ముగియాల్సి ఉండగా... సెప్టెంబర్ 1వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరు నగరంలో మరోసారి లాక్డౌన్ పొడిగింపు - నెల్లూరులో లాక్డౌన్ పొడగింపు వార్తలు
కరోనా ఉద్ధృతి దృష్ట్యా నెల్లూరు నగరంలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. లాక్డౌన్ ఆంక్షలను మరో తొమ్మిది రోజులు పొడిగిస్తూ జిల్లా కలెక్టర్ చక్రధర బాబు నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరు నగరంలో లాక్డౌన్ పొడగింపు
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలకు ప్రజలందరూ సహకరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి.
సింగపూర్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. గరికపాటి ప్రవచనాలు