నెల్లూరు జిల్లాలోని గ్రామాల ప్రజలతోపాటు పట్టణ వాసులు కూడా... రోడ్లను దిగ్బంధం చేస్తున్నారు. నెల్లూరు, కావలి, నాయుడుపేట, గూడూరు పట్టణాల్లోని కాలనీల్లో స్థానికులు ఎవరినీ రానివ్వకుండా రోడ్లకు అడ్డంగా ముళ్ల కంచెలను వేస్తున్నారు. నెల్లూరులోని 54డివిజన్లలో... 26డివిజన్లను రెడ్ అలర్ట్ జోన్లుగా ప్రకటించారు. పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు.
నెల్లూరులో 26 రెడ్ అలర్ట్ జోన్లు... ప్రధాన కూడళ్ల మూసివేత - నెల్లూరులో రెడ్ అలెర్ట్ జోన్లు
నెల్లూరులోని 26 డివిజన్లను రెడ్ అలెర్ట్ జోన్లుగా పోలీసులు ప్రకటించగా.. ఆయా ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ అమలవుతోంది. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు కోరారు.
నెల్లూరులో కఠినంగా లాక్డౌన్ అమలు