కరోనా వైరస్ నియంత్రణకు నెల్లూరు నగరంలో చేపట్టిన లాక్డౌన్ రెండవ రోజుకు చేరింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఒంటి గంట తర్వాత దుకాణాలు మూతపడగా.. వాహన రాకపోకలు తగ్గిపోయాయి. ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను నియంత్రిస్తున్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
నెల్లూరు నగరంలో రెండవ రోజు కొనసాగుతున్న లాక్డౌన్ - నెల్లూరులో లాక్డౌన్ వార్తలు
నెల్లూరు నగరంలో లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువవడంతో..గత రెండు రోజులుగా నగరంలో లాక్డౌన్ ను అమలు చేస్తున్నారు అధికారులు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
lock down in nellore city